Cricket: సెంచరీ చేజార్చుకున్న బెయిర్ స్టో... భారీస్కోరు దిశగా ఇంగ్లాండ్

షార్ట్స్‌లో చూడండి
ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో సెంచరీ చేజార్చుకున్నాడు. బెయిర్ స్టో 99 బంతుల్లో 90 పరుగులు చేసి నాయబ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. బెయిర్ స్టో స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఓపెనర్ జేమ్స్ విన్స్ 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 48, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 7 పరుగులతో ఆడుతున్నారు. 31 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్లకు 168 పరుగులు. మాంచెస్టర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
Go Back to Shorts
Cricket
England
Afghanistan

More Telugu News