భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం పోటు.. నిలిచిపోయిన ఆట
- మాంచెస్టర్ లో ప్రత్యక్షమైన వరుణుడు
- 47 ఓవర్లో మ్యాచ్ నిలిపివేత
- టీమిండియా స్కోరు 305/4
అంతకుముందు, సెంచరీ సాధించిన రోహిత్ శర్మ 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. హార్దిక్ పాండ్య 19 బంతుల్లో 26 పరుగులు చేయగా, ధోనీ 1 పరుగుకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ కు 2 వికెట్లు దక్కాయి. ఒకవేళ భారత్ ఇన్నింగ్స్ ను ఇంతటితో ముగించినట్టయితే డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పాక్ లక్ష్యం 46 ఓవర్లలో 327 పరుగులుగా నిర్దేశంచే అవకాశం ఉంది!