ఆ సినిమాలో సమంత విషయంలో నాగ్ నిర్ణయం ఏమిటో?
- నాగార్జున తాజా చిత్రంగా 'మన్మథుడు 2'
- తదుపరి సినిమాగా 'బంగార్రాజు'
- నాగ్ కి మనవడి పాత్రలో చైతూ
ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ కనిపించనుంది. ఆయన మనవడిగా నాగచైతన్య నటించనున్నాడని అంటున్నారు. ఇక చైతూ జోడీగా సమంతను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొంతమంది నాగ్ దగ్గర వ్యక్తం చేశారట. సమంతను తీసుకోవడం వలన ప్రాజెక్టుపై క్రేజ్ పెరుగుతుందని అంటున్నారట. 'ఓ బేబీ' ఫలితాన్ని బట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడని అంటున్నారు.