యాగంటిలో యాక్షన్ కి దిగిపోయిన 'వాల్మీకి'
- షూటింగు దశలో 'వాల్మీకి'
- యాక్షన్ సీన్ చిత్రీకరణ
- 'జిగర్తాండ' మూవీకి రీమేక్
శివుని ఆశీస్సులతో .. యాగంటి వంటి అద్భుతమైన ప్రదేశంలో షూటింగును మొదలుపెట్టాము అని అన్నాడు. అక్కడ ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ .. బ్రహ్మాజీ తదితరులు ఈ యాక్షన్ సీన్లో పాల్గొంటున్నారు. గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జిగర్తాండ'కి ఇది రీమేక్. వరుణ్ తేజ్ తో పాటు అధర్వ మురళి నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇక మరో కథానాయికగా ఒక తెలుగు అమ్మాయిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.