పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా నాకు దొరికేది కాదు: రావెల కిశోర్ బాబు
- కనీసం ఫోన్లో కూడా పవన్ మాట్లాడే వారు కాదు
- పవన్ నా సలహాలు, సూచనలు ఎప్పుడూ తీసుకోలేదు
- రాజకీయవ్యూహాలపై చర్చకు నాకు అవకాశమివ్వలేదు
పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై చర్చించేందుకు పవన్ కల్యాణ్ తనకు ఎప్పుడూ అవకాశమివ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయన్న వాదనపై ఆయన మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి వరకూ ప్రచారం జరిగిందని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అన్నారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టవుతుందని, మళ్లీ అవినీతి టీడీపీకే పట్టం కట్టాల్సి వస్తుందని భావించిన ప్రజలు చంద్రబాబును, టీడీపీని పక్కనబెట్టి, వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని విశ్లేషించారు.