శుభారంభం అందించిన టీమిండియా ఓపెనర్లు.. చెమటోడ్చుతున్న ఆసీస్ బౌలర్లు

  • టీమిండియా స్కోరు 17 ఓవర్లలో 90/0
  • అర్ధసెంచరీ దిశగా ధావన్
  • రోహిత్ శర్మకు ఆరంభంలో లైఫ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు శుభారంభం అందించారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 47, రోహిత్ శర్మ 40 పరుగులతో ఆడుతున్నారు. మొదట్లో రోహిత్ శర్మ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ ను జారవిడిచిన ఆసీస్ కు ఆ తర్వాత మరో అవకాశం లభించలేదు. భారత ఓపెనింగ్ జోడీని విడదీయడానికి కెప్టెన్ ఫించ్ ఆరుగురు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం దక్కలేదు. స్టార్క్, కమ్మిన్స్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ తీయడంలో సఫలీకృతులు కాలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ధావన్, రోహిత్ ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుని బౌండరీలు రాబట్టారు.
Go Back to Shorts
Team India
Cricket
India
Australia

More Telugu News