సెంటిమెంట్ ఫలిస్తే కోహ్లీ సెంచరీ, విజయం మనదేనట!
- ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడిన కోహ్లీ
- రెండింటిలోనూ తొలి మ్యాచ్ లలో సెంచరీ
- ఆ మ్యాచ్ లలో గెలిచిన భారత్
2011లో బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక, 2015లో ఆడిలైడ్ లో పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 126 బంతుల్లో కోహ్లీ 107 పరుగులు చేశాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఆనవాయితీగా వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీని కోహ్లీ సాధిస్తాడని, భారత విజయం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు.