Cricket: దూకుడుగా ఆడుతున్న రూట్, బట్లర్... ఇంగ్లాండ్ గెలిచేనా?

నాటింగ్ హామ్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తోంది. 349 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్ జాసన్ రాయ్ (8), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9), ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (13) తీవ్రంగా నిరాశపరిచినా, స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ (83 బ్యాటింగ్), జోస్ బట్లర్ (52 బ్యాటింగ్) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు ఉరికిస్తున్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బట్లర్ 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  199 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే 19 ఓవర్లలో 150 పరుగులు చేయాల్సి ఉంది.
Cricket

More Telugu News