ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా శ్రీలంక పనిబట్టిన న్యూజిలాండ్

  • కార్డిఫ్ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో కివీస్ ఘనవిజయం
  • స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో చిత్తుగా ఓడిన లంక
  • వరల్డ్ కప్ లో మరో ఏకపక్ష మ్యాచ్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో మరో ఏకపక్ష మ్యాచ్ జరిగింది. కార్డిఫ్ లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు సరైన మజా అందించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక చచ్చీచెడీ 136 పరుగులు చేస్తే, కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఎంతో సులువైన 137 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (73 నాటౌట్), కొలిన్ మన్రో (58 నాటౌట్) అలవోకగా అందుకున్నారు. లంక బౌలర్లకు ఏమాత్రం వెసులుబాటు ఇవ్వకుండా ఇద్దరూ ధాటిగా ఆడారు.
Go Back to Shorts
Cricket

More Telugu News