మా నాన్న నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నా... కొడుక్కి హితబోధ చేసిన సచిన్ టెండూల్కర్
- ఎలాంటి మార్గంలో నడవాలో తనయుడికి వివరించిన మాస్టర్ బ్లాస్టర్
- ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అర్జున్ టెండూల్కర్
- ఆల్ రౌండర్ గా ప్రస్థానం ఆరంభించిన అర్జున్
తాజాగా, కెరీర్ కు కీలకదశ అయిన ఈ వయసులో తనయుడికి హితబోధ చేశాడు. జీవితంలో కష్టపడి పైకిరావాలే తప్ప విజయం కోసం అడ్డదారుల్లో వెళ్లకూడదని సూచించాడు. "నచ్చినపని చేయడం కోసం సన్మార్గంలోనే పయనించాలి, పక్కదారుల్లో వెళ్లకూడదని చెప్పాను... ఇది మా నాన్న నాకు చెప్పారు, ఇదే విషయాన్ని ఇప్పుడు నా కొడుక్కి చెబుతున్నాను. మొదట్లో అర్జున్ సాకర్ ఆడేవాడు, ఆ తర్వాత చెస్ పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడతనికి క్రికెటే లోకంగా మారిపోయింది. ఓ తండ్రిగా కొడుకు అభిరుచులను గౌరవిస్తాను" అంటూ వ్యాఖ్యానించాడు.
అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబయి టి20 క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాడు. అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకాశ్ టైగర్స్ జట్టు సెమీస్ కు చేరింది. ఈ సందర్భంగా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని సచిన్ దగ్గరుండి పరిశీలించాడు.