కాంగ్రెస్ సీనియర్ నేత షీలాదీక్షిత్‌ను ఓడించి.. ఇంటికెళ్లి ఆశీర్వాదం తీసుకున్న బీజేపీ నేత
- ఈశాన్య ఢిల్లీ నుంచి షీలాపై పోటీ
- 3.6 లక్షల మెజారిటీతో తివారీ ఘన విజయం
- మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత
షీలాపై భారీ మెజారిటీతో విజయం సాధించిన మనోజ్ తివారీ శనివారం షీలా దీక్షిత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలైనట్టు వార్తలు రావడంతో ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.