చంద్రబాబు ఆదేశాలతోనే దాసరి, ఏఎన్నార్, హరికృష్ణ విగ్రహాల తొలగింపు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- వారు వైసీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు
- నా పైనా చంద్రబాబుకు కోపం ఉంది
- 3 విగ్రహాలపైనే ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది?
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను వ్యాఖ్యానించడంతో తన పైనా చంద్రబాబుకి కోపముందని, ఆ కారణంగానే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. బీచ్ రోడ్డులో మరెందరివో విగ్రహాలున్నాయని వాటిని వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేశారని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలని నిలదీశారు.