లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను వేధించింది ఒక్కరేనట.. గుర్తించిన పోలీసులు
- పూనం కౌర్‌పై ఎనిమిది నెలలుగా అశ్లీల రాతలు
- లక్ష్మీపార్వతిపై ఫిబ్రవరి నుంచి వేధింపులు
- ఫిలింనగర్ కేంద్రంగా అశ్లీల రాతలు
లక్ష్మీపార్వతిపైనా, పూనంకౌర్‌పైనా అసభ్య రాతలు రాస్తున్నది ఒకరేనని గుర్తించిన పోలీసులు ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరో వ్యక్తికి కూడా ప్రమేయం ఉందని, హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీరి కార్యాలయం ఉందని వారి దర్యాప్తులో తేలింది. వీరి రాతల వెనక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. డబ్బుల కోసమే వీరు ఇలా వేధింపులకు దిగుతున్నారా? లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? అన్న విషయం నిందితులు పట్టుబడిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.