రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పై ప్రశంసలు కురిపించిన ఐపీఎల్ నిర్వాహకులు!
- విజయవంతంగా ముగిసిన ఐపీఎల్-12 సీజన్
- హైదరాబాద్ లో పోలీసుల ఏర్పాట్లు భేష్
- కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు
రాచకొండ పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. మార్చి 29 నుంచి ఆదివారం వరకూ మొత్తం 8 మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరుగగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా పోటీల నిర్వహణ నిమిత్తం స్టేడియం ఆవరణలో 300కు పైగా సీసీ కెమెరాలు అమర్చగా, తాత్కాలిక నిఘా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. బ్లాక్ టికెట్లపై నిఘాను పెంచి, 93 మందిని అరెస్ట్ చేశారు.