modi: చైనా రోజుకు 50వేల ఉద్యోగాలు ఇస్తుంటే.. మోదీ 24 వేల ఉద్యోగాలను నాశనం చేస్తున్నారు: రాహుల్

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తోందని మండిపడ్డారు. చైనా ప్రతి రోజు 50వేల కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంటే... మోదీ మాత్రం ప్రతి రోజు 24వేల ఉద్యోగాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకునే మోదీ... ఉద్యోగాలను మాత్రం కల్పించలేకపోతున్నారని అన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. పంజాబ్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
modi
rahul gandhi
unemplyment
congress
bjp

More Telugu News