Mahesh Babu: తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' జోరు

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'మహర్షి' నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ ..  కృష్ణా .. గుంటూరు ఏరియాల్లో తొలిరోజున ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.

నైజామ్ లో ఈ సినిమా 6.38 కోట్లను రాబట్టి, 'బాహుబలి' పేరున వున్న రికార్డును చెరిపేసి 'బాహుబలి 2' తరువాత స్థానంలో నిలిచింది. కృష్ణా ఏరియాలో 1.39 కోట్ల షేర్ ను వసూలు చేసి 'భరత్ అనే నేను' వసూళ్లను క్రాస్ చేసింది. ఇక 'గుంటూరు' ఏరియాలో 4.40 కోట్ల వసూళ్లను రాబట్టి, 'వినయ విధేయ రామ' వసూళ్లను అధిగమించింది. ఇలా తొలి రోజునే కొత్త రికార్డులను నమోదు చేసిన 'మహర్షి' .. ఇంకా ఎన్నేసి రికార్డులకు తెరతీస్తుందో చూడాలి. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News