15 రోజులకుగాను పూజా హెగ్డే పారితోషికం 2 కోట్లు!
- స్టార్ హీరోలతో వరుస సినిమాలు
- యూత్ లో పెరిగిన క్రేజ్
- పారితోషికం పెంచుకుంటూ వచ్చిన పూజ
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందుతోంది. వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం మొదట ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించారు. కానీ పూజా హెగ్డే అయితే ప్రాజెక్టు క్రేజ్ పెరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించారు. 15 రోజులు కేటాయిస్తే చాలని చెప్పారట. అందుకు ఆమె 2 కోట్లు పారితోషికంగా అడిగిందని సమాచారం. 'దువ్వాడ జగన్నాథం' సినిమాకి 75 లక్షలు తీసుకున్న పూజా, ఇప్పుడు 2 కోట్లు అడగడంతో ఆ షాక్ నుంచి హరీశ్ ఇంకా తేరుకోలేదని చెప్పుకుంటున్నారు.