Mahesh Babu: యాక్టింగ్ మాత్రమే చేస్తాను .. దర్శకత్వం జోలికి వెళ్లను: మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై పూజా హెగ్డే మాట్లాడుతూ .. "మహేశ్ బాబులో డైరెక్టర్స్ యాంగిల్ ఉండటం నేను గమనించాను .. ఆయన ఒక మంచి దర్శకుడు కాగలడు" అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేసింది.

ఈ ప్రస్తావన అనవసరమైన ప్రచారానికి దారితీస్తుందని భావించిన మహేశ్ బాబు వెంటనే స్పందిస్తూ .. "ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్లు చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడూ యాక్టింగ్ మాత్రమే చేస్తాను .. జీవితంలో దర్శకత్వం వైపు వెళ్లను. నాలో పూజా ఒక దర్శకుడిని చూసిందంటే, అది కేవలం ఆమె అభిమానం మాత్రమే" అని తేల్చి చెప్పేశాడు. మొత్తానికి మహేశ్ బాబు తన కెరియర్ విషయంలో ఫుల్ క్లారిటీతో వున్నాడన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News