పల్లెటూరి మొరటు మనిషిగా ధనుశ్
- ధనుశ్ తాజా చిత్రంగా 'అసురన్'
- చివరి షెడ్యూల్ షూటింగు మొదలు
- తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం
ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన ధనుశ్ పోస్టర్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. పెరిగిన గెడ్డం .. మీసాలు .. తలపాగా .. పంచకట్టు .. పాత చొక్కాతో పల్లెటూరి మొరటు మనిషిగా ధనుశ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. జాతర నేపథ్యంలో ఎవరినో నరికినట్టుగా చేతిలో కత్తితో .. చొక్కాపై రక్తంతో ఆయన ఆవేశంతో వున్నాడు. చివరి షెడ్యూల్ మొదలైందంటూ ధనుశ్ పోస్ట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రీ కొడుకులుగా ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.