అత్త కుమారుడి హత్య కేసులో కన్నడ సినీ నటి ప్రియాంక అరెస్ట్
- అత్త కుమారుడిని హత్య చేయించిన ప్రియాంక
- డబ్బు కోసం వేధిస్తుండటంతో హత్య
- ప్రియాంకతో పాటు ఆమె తల్లి అరెస్ట్
ప్రియాంక అత్త కుమారుడే సునీల్. ప్రియాంక కారు డ్రైవర్ గా వ్యవహరిస్తుండేవాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్ ను డ్రైవర్ పని నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, ఫోన్లు చేస్తూ డబ్బు కోసం తల్లీకూతుళ్లను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేకే సునీల్ ను హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రామనగర్ లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.