మహేశ్ బాబు నెక్స్ట్ మూవీలో శ్రీమంతుడైన అమాయకుడి పాత్రలో బండ్ల గణేశ్
- మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా
- ముఖ్యమైన పాత్రలో బండ్ల గణేశ్
- విజయశాంతి రీ ఎంట్రీ అంటూ టాక్
శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమాయకుడిగా ఈ సినిమాలో బండ్ల గణేశ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ పాత్రను పూర్తిస్థాయి హాస్యభరితంగా అనిల్ రావిపూడి తీర్చిదిద్దాడనీ, బండ్ల గణేశ్ నాన్ స్టాప్ గా నవ్విస్తాడని అంటున్నారు. ఈ సినిమాతో బండ్ల గణేశ్ కమెడియన్ గా మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే సినిమా ద్వారా విజయశాంతి కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది.