Mahesh Babu: 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు నిర్వహిస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ లో మే 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.

వేదిక ఎక్కడ అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, ప్రీ రిలీజ్ ఈవెంట్ పరంగా కూడా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు ఆయన గురించి తమ మనసులో మాటను చెప్పే వీడియోను ఈ వేదికపై ప్లే చేస్తారట. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయం కూడా తెలియాల్సి వుంది. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News