'మహర్షి' నుంచి 'నువ్వే సమస్తం' సాంగ్

  • మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • సాహిత్యం శ్రీమణి      
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటించింది. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం సెకండ్ లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

"నువ్వే సమస్తం .. నువ్వే సిద్ధాంతం .. నువ్వే నీ పంతం .. నువ్వేలే అనంతం .. ప్రతి నిశి మసై .. నీలో కసై దిసై అడుగేసేయ్ మిస్సేయిలులా .. " అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సాంగ్ యూత్ ను .. మహేశ్ బాబు ఫ్యాన్స్ ను పట్టేసేదిలా వుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీఆర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.
Go Back to Shorts
mahesh
pooja hegde
allari naresh

More Telugu News