Mahesh Babu: 'మహర్షి' కథ అక్కడే మలుపు తిరుగుతుందట!

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడి పాత్రలో 'అల్లరి' నరేశ్ కనిపించనున్నాడు. 'అల్లరి' నరేశ్ తన గ్రామానికి చెందిన యువకుడిగా ఒక ఆశయ సిద్ధికోసం పోరాడి చనిపోతాడట. తన స్నేహితుడి 'కల'ను నిజం చేయడం కోసం కోట్ల రూపాయల ఆస్తులను వదులుకుని, ఆ స్నేహితుడి గ్రామానికి మహేశ్ బాబు వస్తాడట. అలా 'అల్లరి' నరేశ్ పాత్ర మరణంతో కథ కీలకమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతున్నదో తెలియాలంటే మే 9వ తేదీ వరకూ ఎదురుచూడవలసిందే.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News