Mahesh Babu: 'సమయం లేదు మిత్రమా ..' అంటోన్న మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికి పనులు పూర్తికాకపోవచ్చనే ఉద్దేశంతో, మహేశ్ బాబును ఒప్పించి మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టుగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ షూటింగు విషయంలో ఆలస్యం జరుగుతోందనే వార్తలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

మే 9వ తేదీన ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను విడుదల చేయవలసిందేననే పట్టుదలతో మహేశ్ బాబు వున్నాడు. ఇంకా కొంత టాకీపార్టు .. అబుదాబీలో చిత్రీకరించవలసిన రెండు పాటలు పెండింగులో వున్నాయి. అందువల్లనే 'సమయం లేదు మిత్రమా .. ' అంటూ వంశీ పైడిపల్లిని మహేశ్ బాబు తొందర చేస్తున్నాడట. ఈ కారణంగానే ఆదివారాలతో పాటు .. పని గంటలు పెంచేసి మరీ వర్క్ చేస్తున్నారట. అన్ని వైపులా నుంచి పనులను వేగవంతం చేసినట్టుగా సమాచారం.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News