కోడలికి అన్నం పెట్టక మాడ్చి మాడ్చి చంపిన అత్తింటివారు!
Add ap7am to your home Screen

కోడలికి అన్నం పెట్టక మాడ్చి మాడ్చి చంపిన అత్తింటివారు!

  • కేరళలోని కొల్లా సమీపంలో ఘటన
  • ఎముకల గూడులా మారి మరణించిన తుషార
  • భర్త, అత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
అడిగినంత కట్నం తేలేదన్న కోపంతో ఇంటి కొడలికి భోజనం పెట్టకుండా మాడ్చి చంపిన ఘటన కేరళలోని కొల్లాం సమీపంలో ఉన్న కరునాగపల్లిలో తీవ్ర కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తుషార (27) అనే యువతికి ఐదేళ్ల క్రితం వివాహం కాగా, ఎముకల గూడులా మారి, చిక్కి శల్యమైన స్థితిలో ఆమె, అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది. ఆపై విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. తుషార భర్త చందూలాల్, అత్త గీతాలాల్ లు, గత ఐదేళ్లలో ఆమెకు ఎన్నడూ అన్నం పెట్టలేదు. నిత్యమూ నానబెట్టిన బియ్యాన్ని తింటూ వచ్చిన తుషార, బక్కచిక్కి, బలహీనమై పోయింది. కండరాలు లేక, 20 కిలోల ఎముకల గూడులా మారిపోయి, మరణించింది. తుషార తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తలను అరెస్ట్ చేశారు. ఏడాదిగా తమ కుమార్తెను గీతాలాల్ కలుసుకోనివ్వలేదని, అత్త మానసిక, శారీరక వేధింపులకు తమ బిడ్డ బలైపోయిందని తుషార తల్లిదండ్రులు వాపోయారు.
Kerala
Wife
Food
Died

More Telugu News