కాంగ్రెస్ కు 16 లోక్ సభ సీట్లు ఇవ్వండి.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తాడు!: పొన్నం ప్రభాకర్
- 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడించాక ఫేస్ బుక్ పోస్టుకు స్పందించాడు
- కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
- కరీంనగర్ లో మీడియాతో కాంగ్రెస్ నేత
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా నగదును పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినోద్ కుమార్ గెలిస్తే మంత్రి అవుతారని ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలు వినోద్ ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారో చెప్పండి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో ఓడిపోయాక కేసీఆర్ ఒక్క ఫేస్ బుక్ పోస్టుకు స్పందించారనీ, ఈ లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే, సీఎం ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను స్థానికుడిననీ, వినోద్ కుమార్ స్థానికేతరుడని విమర్శించారు.