మీరు మంగళగిరి చూసుకోండి బాబోయ్ అంటున్నా చిట్టినాయుడికి ఎక్కడంలేదే!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం
- వరుస ట్వీట్లు చేసిన వైసీపీ నేత
- లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు
- లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నాడంటూ ఎద్దేవా
కొందరు అభ్యర్థులు నేరుగా చెప్పలేక, మీరు మంగళగిరి చూసుకోండి చాలు అంటున్నా ఈ చిట్టినాయుడి పసిమెదడుకు లాజిక్ ఎక్కడం లేదే! అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు ఆయన మరో ట్వీట్ లో, లోకేశ్ కామెడీ ప్రసంగాలతో టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని, లోకేశ్ మంగళగిరిలో ఉంటేనే మంచిదని వారు చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 9న పోలింగ్ ఉంటుందని అవగాహన లేకుండా చెప్పడం, బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎత్తుకెళతారని వ్యాఖ్యానించడం గురించి నాయకులు చంద్రబాబుకు చెప్పినా ఫలితం శూన్యమని పేర్కొన్నారు.