జగన్ బంధువు ధర్మారెడ్డిపై చేసిన ఫిర్యాదును ఈసీ ఎందుకు పట్టించుకోలేదు?: బాబు రాజేంద్రప్రసాద్ ఫైర్
- ఫామ్-7పై ఎందుకు చర్య తీసుకోలేదు?
- చంద్రబాబుపై దాడి చేసేందుకు జగన్ కుట్ర
- తెలంగాణలో ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదు?
నాడు తెలంగాణ ఎన్నికల్లో విపక్షాలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తే ఎందుకు బదిలీ చేయలేదని, ఫామ్-7 దరఖాస్తులపై కూడా ఈసీ ఎందుకు చర్య తీసుకోలేదని రాజేంద్రప్రసాద్ నిలదీశారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్న జగన్ బంధువు ధర్మారెడ్డి ఎన్నికల అధికారులను ప్రభావితం చేస్తున్నారన్న టీడీపీ ఫిర్యాదును కూడా ఈసీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.