South Korea: దక్షిణ కొరియాలో తీవ్ర కలకలం... హోటళ్లలో బస చేసిన 1600 మంది చర్యలు ప్రత్యక్ష ప్రసారం!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణ కొరియాలోని 10 నగరాల్లో ఉన్న ప్రముఖ హోటళ్లలోని 42 గదులు, 30 సూట్స్ లో బస చేసిన 1,600 మంది చేస్తున్న పనులన్నీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, స్పై కామ్ స్కాండల్ కు ప్లాన్ చేసిన కొందరు, ఓ ప్రణాళిక ప్రకారం, హోటళ్ల గదుల్లో రహస్య కెమెరాలను అమర్చారు. వాటన్నింటినీ ఒకేసారి ఆన్ చేసి, గదుల్లో వారి చర్యలను లైవ్ లో చూపించారు. ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశామని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న అభియోగాలపై పలువురిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

హోటల్ గదుల్లోని డిజిటల్ టీవీ బాక్సులు, వాల్ సాకెట్లు, హెయిర్ డ్రయ్యర్ హోల్డర్లు తదితరాల్లో కెమెరాలను అమర్చారని, వాటి దృశ్యాలను ప్రసారం చేశారని తెలిపారు. ఈ స్కామ్ వెనుక హోటల్ యాజమాన్యాల పాత్ర ఉన్నట్టు తేలలేదని అన్నారు. ఈ దృశ్యాలను 4 వేల మందికి పైగా తిలకించారని, అందులో 97 మంది ఫుటేజ్ ని రీప్లేలో చూసేందుకు 44.95 డాలర్ల చొప్పున చెల్లించినట్టు గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతుంటేనే తాము గుర్తించి అడ్డుకున్నామని తెలిపారు. కాగా, కొరియాలో మహిళలను చాటుమాటుగా వీడియోలు తీస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారేమీ కాదు. 2012లో ఇల్లీగల్ ఫిల్మింగ్ పై 2,400 కేసులు నమోదుకాగా, 2017లో ఏకంగా 6,400 కేసులు నమోదయ్యాయి. "మై లైఫ్ ఈజ్ నాట్ యువర్ పోర్న్" అంటూ మహిళా సంఘాలు ధర్నాలు, నిరసనలు కూడా చేశాయి.
Go Back to Shorts
South Korea
Secret Camera
Scandal
Hotel
Guests
Live
Streaming

More Telugu News