సన్ రైజర్స్ ఆటగాళ్లకు మినప గారెలు, వడలు తినిపించిన యాంకర్ సుమ

షార్ట్స్‌లో చూడండి
మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ సంరంభానికి తెరలేవనుంది. ఈ క్రమంలో అన్ని జట్ల ఆటగాళ్లు అటు ప్రాక్టీసుతో పాటు ప్రమోషనల్ ఈవెంట్లతోనూ బిజీగా ఉన్నారు. గతేడాది రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు కూడా తీరికవేళల్లో యాడ్ షూటింగుల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమతో కలిసి ఓ యాడ్ ఫిలిం (తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు?) షూటింగ్ లో సందడి చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఎంతో సరదాగా ఉండే సుమ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంతో ఉత్సాహంగా యాడ్ చిత్రీకరణలో పాల్గొంది.

ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు వార్నర్ కు రుచిచూపించింది. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ యాడ్ లో భాగంగా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేశాడు. సన్ రైజర్స్ టీమ్ కు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సుమ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయగా అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.
Go Back to Shorts
Cricket
Hyderabad

More Telugu News