వాట్సాప్ లో అభ్యంతరకర పోస్ట్.. అడ్మిన్ తో పాటు సభ్యుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!
- తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
- విద్వేష చిత్రాన్ని పోస్ట్ చేసిన జొమాటో బాయ్
- పట్టించుకోని అడ్మిన్, పోలీసులను ఆశ్రయించిన మరో సభ్యుడు
ఇక్కడి మౌలాలి షఫీనగర్‌కు చెందిన సిరాజ్ జొమాటో సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇతను లాయల్ పార్టనర్స్ ఎమలార్డ్ అనే వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రూపును కుషాయిగూడ నాగార్జున్‌నగర్‌కు చెందిన కమ్మంపల్లి వెంకటేశ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 26న సిరాజ్ ఓ అభ్యంతరకరమైన ఫొటోను గ్రూపులో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని అడ్మిన్ పట్టించుకోలేదు.
దీంతో ఇదే వాట్సాప్ గ్రూపులో ఉన్న తిరుమలేశ్వర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సిరాజ్ పెట్టిన పోస్ట్ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సిరాజ్, వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.