Mahesh Babu: షూటింగుకి అనుమతించని అధికారులు .. ఎయిర్ పోర్ట్ నుంచి వెనుదిరిగిన మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' రూపొందుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గాను .. బడా సంస్థకి సీఈఓ గాను .. రైతుగాను మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తాజాగా హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న ఈ సినిమా షూటింగుకి అనుకోని అవాంతరం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ నుంచి మహేశ్ బాబు వెళ్లిపోయేలా చేసింది.

నిన్న ఉదయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షూటింగ్ చేసుకోవడానికి 'మహర్షి' టీమ్ అధికారుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకుంది. అయితే భద్రతా సంబంధమైన కొన్ని సమస్యల కారణంగా, అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. హై అలర్ట్ ప్రకటించిన కారణంగా, అధికారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో 5 గంటలపాటు తన క్యారవాన్ లో నిరీక్షించిన మహేశ్ బాబు, ఓపిక నశించడంతో తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News