Mahesh Babu: 'మహర్షి' సెట్లో హీరో కార్తీ సందడి

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి'సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేశ్ బాబు .. ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తన సినిమాకి సంబంధించిన విషయంపై ఫిల్మ్ సిటీకి వచ్చిన కార్తీ, 'మహర్షి' సినిమా సెట్ కు వచ్చారు.

దర్శకుడు వంశీ పైడిపల్లితో గతంలో ఆయన 'ఊపిరి' సినిమా చేయడం వలన ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అలాగే మహేశ్ బాబుతోను మంచి స్నేహం వుంది. అందువలన ఆయన 'మహర్షి' సెట్ కి వచ్చి వంశీ పైడిపల్లితోను .. మహేశ్ తోను సరదాగా ముచ్చటించారు. ఈ సినిమా విశేషాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా అటు వంశీ పైడిపల్లి కెరియర్లోను .. ఇటు మహేశ్ కెరియర్లోను చెప్పుకోదగినదిగా నిలిచిపోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News