అడివి శేష్ పేరును సూచించిన సమంత!
- సమంత ప్రధాన పాత్రధారిగా 'బేబీ'
- ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ
- కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్
సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'బేబీ' సినిమా రూపొందుతోంది. ఓ కొరియన్ మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన రోల్ వుందట. ఈ పాత్ర అడివి శేష్ చేస్తే బాగుంటుందని సమంత సూచించడంతో, నందిని రెడ్డి ఆయనను తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి 'బేబీ'లో అడివి శేష్ కూడా జాయిన్ అయ్యాడన్న మాట.