ఈ నెలలో ఏపీలో మోదీ, అమిత్ షాలు పర్యటిస్తారు: కన్నా లక్ష్మీనారాయణ
- 10న గుంటూరులో, 16న విశాఖలో మోదీ పర్యటన
- ఈ నెల 4న విజయనగరంలో అమిత్ షా పర్యటిస్తారు
- పలాస నుంచి ‘సత్యమేవ జయతే’ బస్సు యాత్ర ప్రారంభిస్తారు
అదే విధంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఏపీలో పర్యటిస్తారని అన్నారు. ఈ నెల 4న విజయనగరంలో నిర్వహించే పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశమవుతారని, అనంతరం, పలాస నుంచి ‘సత్యమేవ జయతే’ బస్సు యాత్రను ఆయన ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో శక్తి కేంద్రాల సభ్యులతో అమిత్ షా సమావేశం కానున్నట్టు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.