అనిల్ రావిపూడిని అరెస్ట్ చేసిన వరుణ్ తేజ్.. ట్విట్టర్లో సరదా ఫొటోను పోస్ట్ చేసిన మెగా హీరో!
- బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న‘ఎఫ్2’
- సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వరుణ్
- నకిలీ పోలీసును కలవండంటూ పోస్ట్
తాజాగా వరుణ్ తేజ్ ఓ సరదా ట్వీట్‌తో పాటు, ఫొటోను కూడా షేర్ చేశారు. ‘థియేటర్లలో కడుపుబ్బా నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా’ అంటూ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అలాగే ‘నకిలీ పోలీసును కలవండి’ అంటూ మరో ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలను, కామెంట్లను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు పెడుతున్నారు.