Mahesh Babu: 'మహర్షి' విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు, పూర్తి భిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత .. ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ వినిపించింది.

దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందా అనే విషయంలో స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ క్లారిటీ దిల్ రాజు నుంచి వచ్చేసింది. 'ఎఫ్ 2' సినిమా హిట్ కొట్టిన సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చిన దిల్ రాజు, 'మహర్షి' సినిమాను గురించి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీన 'మహర్షి' సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. మరో మూడు నాలుగు ప్రాజెక్టులు షూటింగుకి వెళుతున్నాయని అన్నారు. 'మహర్షి'లో అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను చేస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News