వెండితెరపై కథానాయకుడు.. రాజకీయాల్లో ప్రజానాయకుడు!: ఎన్టీఆర్ కు లోకేశ్ నివాళి
- ప్రజానాయకుడిగా ఓ యుగానికి విస్తరించారు
- ఆయన చరిత్రను మననం చేసుకుందామని వ్యాఖ్య
- నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వెండితెరపై మంచికి అండగా నిలిచిన కథానాయకుడిగా, రాజకీయాలలో నిరుపేదకు బంధువై నిలిచిన ప్రజా నాయకుడిగా, తన జీవితకాలాన్ని ఒక యుగానికి విస్తరించుకున్న ప్రజల మనిషి, కీర్తిశేషులు మా తాతగారు ఎన్టీఆర్. ప్రాతః స్మరణీయులైన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఘనచరిత్రను మననం చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.