Mahesh Babu: 'మహర్షి' రిలీజ్ డేట్ వాయిదా .. కారణమదేనట!

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడంతో, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందే చెప్పారు.

అయితే ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాదనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 26వ తేదీకి మార్చే ఆలోచన చేస్తుండటమే. గతంలో మహేశ్ చేసిన 'పోకిరి' .. 'భరత్ అనే నేను' సినిమాలు ఏప్రిల్ చివరివారంలో విడుదలై విజయవిహారం చేశాయి. ఈ సెంటిమెంట్ కారణంగానే 'మహర్షి' రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మార్చనున్నట్టుగా చెబుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నాటికి పనులన్నీ పూర్తికాకపోవచ్చనే ఉద్దేశంతోనే రిలీజ్ డేట్ ను మార్చనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News