aryan rajesh: ఎవరూ సాయం చేయలేదు .. వాళ్ల ఆలోచన సరైనదే: ఆర్యన్ రాజేశ్

షార్ట్స్‌లో చూడండి
హీరోగా ఆశించినస్థాయి సక్సెస్ ను అందుకోలేకపోయిన ఆర్యన్ రాజేశ్, త్వరలో ఈవీవీ బ్యానర్ పై వరుస సినిమాల నిర్మాణాన్ని చేపట్టే ఆలోచనలో వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."కెరియర్ ఆరంభంలో నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. అలాగే మొహమాటంతో నాకు నచ్చని కొన్ని సినిమాలు చేశాను. అందువలన పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు .. నా పరాజయాలకు నేనే కారణమని అనుకుంటున్నాను. నాన్నగారి సపోర్ట్ తో పైకొచ్చిన నిర్మాతలు చాలామందే వున్నారు. వాళ్లెవరూ నాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ల దృష్టితో చూస్తే వాళ్ల ఆలోచన కూడా సరైనదే. ఎందుకంటే ఎవరైనా సరే హిట్ వుండి .. మార్కెట్ వుండే హీరోలతోనే గదా సినిమాలు చేస్తారు. అందుకే నేను హీరోగా నా బ్యానర్లోనే సినిమాలు చేసుకుంటాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
aryan rajesh

More Telugu News