'నా సోదరి శబరిమలకు వెళ్లిందా? నమ్మలేకున్నా'నన్న కనకదుర్గ సోదరుడు!

  • ఎవరో కుట్ర చేశారు
  • భయపెట్టి ఆమెను ఆలయంలోకి పంపారు
  • కోజికోడ్ లో మీడియాతో కనకదుర్గ సోదరుడు
హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, అయ్యప్పను కొలిచే తమ కుటుంబంలోని మహిళ, శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుందంటే నమ్మలేకున్నానని కనకదుర్గ సోదరుడు వ్యాఖ్యానించారు. కోజికోడ్ లో ఈ ఉదయం కనకదుర్గ ఇంటి ముందు పలువురు కేరళవాసులు నిరసనకు దిగగా, ఆయన మాట్లాడారు. తన చెల్లెలు అయ్యప్పను దర్శించుకుందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక కుట్ర ఉందని అన్నారు. తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తమకు తెలియడం లేదని అన్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన తమ కుటుంబంలో నెలకొనివుందని చెప్పారు.
Go Back to Shorts
Sabarimala
Kerala
Kanadakurga

More Telugu News