అనుష్క కొత్త సినిమా లుక్ అదిరింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క కొత్త సినిమా లుక్ అదిరింది!

  • 'భాగమతి' తరువాత అనుష్క చేస్తోన్న సినిమా 
  • నాయిక ప్రాధాన్యత కలిగిన కథ
  • రచయితగా .. సహ నిర్మాతగా కోన వెంకట్  
అందం .. అంతకి మించిన అభినయం అనుష్క సొంతం. నాయిక ప్రాధాన్యత కలిగిన కథలతోను విజయాలను అందుకున్న ఘనత ఆమె సొంతం. అలాంటి అనుష్క ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య తగ్గించింది. కథాబలం .. పాత్ర బలం కలిగిన సినిమాలు మాత్రమే చేయాలనే తన నిర్ణయమే అందుకు కారణమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. అలాంటి అనుష్క 'భాగమతి' తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకుంది.

కోన వెంకట్ వినిపించిన ఒక కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా నుంచి అనుష్క పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ వచ్చిన అనుష్క లుక్స్ లో ఇది బెస్ట్ అనిపిస్తోందని కోన వెంకట్ అన్నారు. తమ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్ తనకి బాగా నచ్చిందని చెప్పారు. నెమలి ఈక పట్టుకుని ప్రేమ భావనతో .. ఆరాధనా పూర్వకంగా చూస్తున్నట్టుగా వున్న అనుష్క లుక్ నిజంగానే మనసులు దోచేలా వుంది. 
anushka

More Telugu News