అనుష్క తీసుకున్న కొత్త నిర్ణయం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క తీసుకున్న కొత్త నిర్ణయం?

  • అనుష్కకి విపరీతమైన ఆదరణ 
  • సినిమాలు తగ్గించిన అనుష్క 
  • ఇకపై ఏడాదికి ఒక సినిమానే  
అందం .. అభినయం కలగలిసిన కథానాయికగా అనుష్కకి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. 'బాహుబలి' సినిమాతో అనుష్క క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అనుష్క ఒక సాధారణమైన కథానాయిక కాదనే అభిప్రాయానికి ఆడియన్స్ వచ్చారు. విలక్షణమైన .. ప్రత్యేకమైన పాత్రల్లో ఆమెను చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

దాంతో ఆ క్రేజ్ ను నిలుపుకోవడానికి అనుష్క కూడా గ్లామర్ పాత్రలను తగ్గించుకుంటూ వచ్చింది. కథలో దమ్ము వుంటేనే .. అదీ నాయిక ప్రాధాన్యత కలిగినదైతేనే ఆమె అంగీకరిస్తోంది. అలా 'భాగమతి' తరువాత మళ్లీ నాయిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో మాధవన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ నగర్లో మరో వార్త షికారు చేస్తోంది. ఇకపై ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలనే నిర్ణయానికి అనుష్క వచ్చిందనేది ఆ వార్త సారాంశం. అనుష్క అభిమానులకు ఈ వార్త నిరాశను కలిగించేదేనని చెప్పాలి.    
anushka

More Telugu News