చైతూ జోడీగా నిత్యామీనన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైతూ జోడీగా నిత్యామీనన్

  • 'మజిలి' సినిమాతో బిజీగా చైతూ 
  • తరువాత సినిమా మేర్లపాక గాంధీతో 
  • త్వరలోనే రానున్న అధికారిక ప్రకటన  
ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ .. 'కృష్ణార్జున యుద్ధం'తో నిరాశ పరిచాడు. ఇటీవల ఆయన చైతూకి ఒక కథ వినిపించడం .. వెంటనే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించిన మేర్లపాక గాంధీ .. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట. దాదాపు ఆ పాత్రకి ఆమె ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టుగా సమాచారం.  
nagachaitanya
nithya menon

More Telugu News