అసలు కేసీఆర్ మనిషేనా? నల్లగొండలో భయపడి గజ్వేల్ కు పారిపోయాడు!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- కోమటిరెడ్డి చాలా మంచి వ్యక్తి
- ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించండి
- ఎన్నికల ప్రచారంలో దర్శకుడు రవిబాబు
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ గత 20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వెనుకపడిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనిషేనా? అని ప్రశ్నించారు. నల్లగొండలో పోటీచేస్తే తమ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ గజ్వేల్ కు పారిపోయారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ ఆత్మగౌరవం గెలుస్తుందో, లేక కేసీఆర్ దోపిడీ చేసిన వందలకోట్ల సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తేలుతుందని ప్రకటించారు.