నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో పోటీ చేస్తే తప్పేంటి?: సీపీఐ నేత నారాయణ
- దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు
- యూఎస్ లో చదివిన కేటీఆర్ కు ఆ మాత్రం తెలియదా?
- కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జగద్గిరిగుట్టలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే శ్రీశైలం గౌడ్ ను గెలిపించాలని కోరారు. అనంతరం, శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ బూటకపు వాగ్దానాల గురించి ప్రజలు ఆలోచించాలని, తెలంగాణ, సీమాంధ్ర వాళ్లందరూ ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.