గాంధీ అనే పేరు లేకుంటే రాహుల్ జిల్లా అధ్యక్షుడు కూడా కాలేడు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
- గాంధీ కుటుంబంలో జన్మించారు కాబట్టే చీఫ్ అయ్యారు
- రాహుల్ గోత్రం గురించి మాట్లాడింది అందుకే
- నెహ్రూ, సర్దార్ పటేల్ వల్లే కాంగ్రెస్‌కు ఆ పేరు
రాహుల్ గాంధీ గోత్రంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. ఆ విషయం ప్రజల్లోకి వచ్చినందుకే బీజేపీ రాహుల్ గోత్రం గురించి ప్రశ్నించినట్టు వివరణ ఇచ్చారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ కౌల్ బ్రాహ్మిణ్ అని, గుజరాత్‌లో శివ భక్తుడిగా మారిపోతారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎవరు ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చని, అయితే, ఇందిరా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, జవహర్‌లాల్ నెహ్రూ కానీ ఎవరైనా ఇలా ప్రవర్తించారా? అని రవిశంకర్ ప్రశ్నించారు. మాట్లాడేందుకు వేరే విషయాలు లేకే ఇటువంటి విషయాలపై రాహుల్ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.