తెలంగాణలో నా అంత ప్రజాభిమానం ఉన్న నేత ఎవ్వరూ లేరు.. భవిష్యత్ లో కూడా ఎవరూ రారు!: కె.జానారెడ్డి
- ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలిచా
- ఈ రికార్డు మరో నేత సాధించలేకపోయారు
- నల్లగొండ జిల్లా ప్రచారంలో జానారెడ్డి వెల్లడి
ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ప్రజాభిమానం మెండుగా ఉన్న నేతను నేనే. ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నాది. నాలాగా ఇన్నిసార్లు ప్రజాభిమానంతో గెలుపొందే నాయకుడు రాష్ట్రంలో ఎవ్వరూ లేరు.. ఇకపై ఎవరూ రారు’ అని వ్యాఖ్యానించారు.
ఈసారి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడం తథ్యమని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనీ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టికరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.