ఆ వార్తలో నిజం లేదు.. రాజమౌళి అడిగితే మాత్రం తప్పకుండా చేస్తాను: కన్నడ స్టార్ హీరో యష్
- రాజమౌళి గారి మూవీలో నేను లేను
- నన్ను ఎవరూ సంప్రదించలేదు
- ఒక కథానాయికగా కీర్తి సురేశ్?
తాజాగా ఈ విషయంపై యష్ స్పందించాడు. ''రాజమౌళి గారి మల్టీ స్టారర్లో నేను విలన్ గా చేయడం లేదు. ఈ ప్రాజెక్టు నుంచి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఈ సినిమాలో చేయమని రాజమౌళి గారు అడిగితే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దాంతో ఇప్పటివరకూ విలన్ యష్ అనుకునేవారిలో మళ్లీ ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.